ఓటిటిలో “జవాన్” నుంచి అసలు సర్ప్రైజ్ అట..!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తున్న భారీ హిట్ చిత్రం “జవాన్” సక్సెస్ సౌండ్ ఓ రేంజ్ లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అట్లీ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో చేసిన ఈ సినిమా భారీ హిట్ అయ్యి నిన్ననే 900 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా దాటేసి 1000 కోట్ల సినిమా దిశగా వెళ్తుంది.

ఇక ఈ భారీ సినిమా అయితే ఇప్పటికీ థియేటర్లు లో మెయిన్ గా హిందీ సహా ఓవర్సీస్ మార్కెట్ లో గట్టిగా రన్ అవుతుంది. మరి ఇంకా థియేటర్స్ లో అద్భుతంగా రన్ అవుతున్న ఈ సినిమాపై దాని ఓటిటి వెర్షన్ కి సంబంధించి పలు ఆసక్తికర వార్తలు ఇపుడు వైరల్ గా మారుతున్నాయి.

కాగా వీటి ప్రకారం అయితే ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో చాలా వ్యత్యాసం చూపించనున్నారని దర్శకుడు అట్లీ అంటున్నాడు. తాము థియేట్రికల్ గా చూపించిన వెర్షన్ కి డిఫరెంట్ గా అందరికీ సర్ప్రైజ్ చేసే వెర్షన్ ని అయితే ఓటిటికి ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు. ఆ కోణంలోనే ఈ వెర్షన్ ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టుగా తెలిపాడు.

దీనితో జవాన్ థియేటర్స్ ని మించి ఓటిటి లో ట్రీట్ ఇంకా గట్టిగా ఉండేలా ఉందని చెప్పాలి. అయితే ఇది ఇంకా ఎపుడు వస్తుంది అనేది ఫిక్స్ కాలేదు కానీ వస్తే మాత్రం జవాన్ కొత్త సీన్స్ తో చూడొచ్చు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె నయనతారలు హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.