సీక్రెట్ బయటపడింది.. గూగుల్‌లో అవి సర్చ్ చేసిన దీపిక పదుకొణె

సీక్రెట్ బయటపడింది.. గూగుల్‌లో అవి సర్చ్ చేసిన దీపిక పదుకొణె

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. తారలందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు. వెరైటీ చాటింగ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో తారలు వారి ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోలను షేర్ చేస్తాము.. అడగండంటూ చాలెంజ్‌లు విసురుతున్నారు. ఈ క్రమంలో సమంత, ప్రణీత, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు ఇప్పటికే రచ్చ చేశారు.

Deepika Padukone About Googled Things Goes viral
Deepika Padukone About Googled Things Goes viral

ఈ క్రమంలో సమంతకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.తన జీవితంలోని ముఖ్యమైన ఫోటోలతో పాటు కొన్ని సీక్రెట్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక ప్రణీత విషయంలో అయితే ఏకంగా ప్రైవేట్ ఫోటోనే బయటకు వచ్చింది. బాత్ టబ్ పిక్ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో కీర్తి సురేష్‌ కూడా కొన్ని ఫోటోలను బయట పెట్టింది. కాలేజ్ రోజుల్లో కీర్తి సురేష్‌ను చూసి అందరూషాక్ అయ్యారు.

తాజాగా దీపిక పదుకొణె కూడా ఇలాంటి ఓ ఆటనే ఆడింది. మామూలుగానే దీపిక సోషల్ మీడియా ఖాతాల్లోంచి అన్ని పోస్ట్‌లను డిలీట్ చేసి కొత్తగా ప్రారంభించింది. ఈ క్రమంలో దీపిక పదుకొణె కూడా అభిమానులతో ఫోటోలను పంచుకుంది. ఈ క్రమంలో ఆమె ఫ్యాన్స్ రకరకాల ఫోటోలను అడిగారు. అందులో ఓ నెటిజన్ మాత్రం కాస్త క్రియేటివిటీని జోడించాడు. చివరగా గూగుల్‌లో ఏం సర్చ్ చేశావ్ అని అడిగాడు. దీంతో ఆమె సర్చ్ చేసిన వాటిని స్క్రిన్ షాట్ తీసి పెట్టింది. గ్లోవ్స్ సైజ్ ఎలా కొలవాలో సర్చ్ చేసిందట.