Jr.NTR: తారక్ లో ఆ స్కిల్స్ ఎంతో నచ్చుతాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి దీపికా?

Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకొని నేడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇంకా ఈ సినిమా విడుదల కాకుండానే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్, టీజర్ విడుదల కావడంతో ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతున్న దీపికా పదుకొనే తాజాగా తారక్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి అభిమానిగా మారిపోయానని తెలియజేశారు.

ఎన్టీఆర్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆయన యాక్టింగ్ స్కిల్స్ తనకు ఎంతగానో నచ్చుతాయని, ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని దీపికా పదుకొనే తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. తనతో నటించే అవకాశం కోసమే తాను ఎదురు చూస్తున్నానని దీపిక ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ త్వరలోనే ఈమెకు ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నారు.