డేవిడ్ వార్నర్‌ని పూనిన ఎన్టీఆర్‌.. ఎలా ర‌చ్చ చేశాడో చూడండి!

డేవిడ్ వార్న‌ర్ ఈ పేరు క్రికెట్ ప్రేమికులకే కాదు, సినీ ల‌వ‌ర్స్‌కు కూడా చాలా సుప‌రిచితం. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎక్కువ‌గా సౌత్ సినిమాల‌కు టిక్ టాక్ వీడియోలు చేసి ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన డేవిడ్ వార్న‌ర్ బుట్ట‌బొమ్మ‌, మైండ్ బ్లాక్ సాంగ్స్‌కు త‌న ఫ్యామిలీతో చేసిన డ్యాన్స్ లు స్పెష‌ల్ హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు.వార్న‌ర్‌లో మంచి క్రికెట‌రే కాదు డ్యాన్స‌ర్ న‌టుడు కూడా ఉన్నాడ‌న్న విష‌యం లాక్‌డౌన్ స‌మ‌యంలో అందరికి అర్ధ‌మైంది.

అయితే వార్న‌ర్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రంలోని ఓ సీన్‌లో ఎన్టీఆర్ ష‌ర్ట్ లేకుండా మొండి క‌త్తితో దొడ‌ను దువ్వే సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సీన్‌లో ఎన్టీఆర్ కు బ‌దులు డేవిడ్ వార్న‌ర్ క‌నిపిస్తున్నాడు. అది ఎలా అంటే ఎన్టీఆర్ ముఖాన్ని త‌న ముఖంతో మార్ఫింగ్ చేసి నెటిజన్స్ కు మంచి వినోదాన్ని అందిస్తున్నాడు. గ‌తంలో రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల ముఖాలకు తన ముఖాన్ని తగిలించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు వార్నర్.

వార్న‌ర్ పోస్ట్ చేసి వీడియో కొన్ని సెక‌న్ల పాటే ఉన్న‌ప్ప‌టికీ దీనికి మంచి స్పంద‌న వ‌స్తుంది. డేవిడ్ వార్నర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ వీడియోకు ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్ 2020లో త‌న టీంని ప్లేఆఫ్ వ‌ర‌కు తీసుకెళ్లిన వార్న‌ర్ ఫైన‌ల్‌కు తీసుకెళ్ళ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం భార‌త్‌తో వ‌న్డే,టీ 20, టెస్ట్ సిరీస్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుండ‌గా, ఈ సిరీస్ మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది.