ర‌జనీకాంత్‌ను వ‌ద‌ల‌ని డేవిడ్ వార్న‌ర్.. ద‌ర్భార్ స్టైల్‌లో తెగ ర‌చ్చ చేసేసాడుగా!

ఆస్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌త్యర్ధి బౌల‌ర్స్‌పై ఎంత‌గా విరుచుకుప‌డ‌తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ‌న్డేలు అయిన టెస్ట్‌లు అయిన వార్న‌ర్ బ్యాటింగ్ మాత్రం ఒకేలా ఉంటుంది. ప్ర‌తి బంతిని బౌండ‌రీకు త‌ర‌లించాల‌నే క‌సితో ఆడే వార్నర్ లాక్ డౌన్ వ‌ల‌న దాదాపు ఎనిమిది నెల‌ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో ఏం చేయాలా అని ఆలోచించి టాక్‌టాక్‌లో వెరైటీ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించాడు. ఎక్కువగా సౌత్ సినిమాల‌కు సంబంధించిన పాట‌ల‌కు డ్యాన్స్ లు చేయ‌డం, లేదంటే హీరోల హావభావాల‌కు త‌గ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డం వంటివి చేస్తూ థ్రిల్ చేశాడు.

భార‌త్‌తో ఆడుతున్న వ‌న్డేలో గాయ‌ప‌డ్డ వార్న‌ర్ తొలి రెండు టెస్ట్‌ల‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైన వార్న‌ర్ రీసెంట్‌గా త‌న సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. 2020వ సంవ‌త్స‌రానికి గుడ్ బై చెబుతూ మ‌హ‌ర్షి స్టైల్‌లో అల‌రించాడు. మ‌హ‌ర్షి సినిమాలోని మ‌హేష్ సీన్స్‌లో ఆయ‌న ఫేస్‌కు బ‌దులు వార్న‌ర్ త‌న ఫొటో యాడ్ చేసి ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఇక కొత్త సంవ‌త్స‌రానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ద‌ర్భార్ క్లిప్ షేర్ చేశాడు. ఇందులో ర‌జ‌నీకాంత్ ఫేస్ స్థానంలో త‌న ముఖాన్ని అతికించాడు. ఈ వీడియో కూడా నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వార్న‌ర్ హంగామా చూస్తుంటే రానున్న రోజుల‌లో మ‌నోడు సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ అవుతాడు అని అంటున్నారు. జ‌నవ‌రి 7 నుండి మూడో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌తో మ‌ళ్ళీ గ్రౌండ్‌లో దిగ‌బోతున్నాడు వార్న‌ర్. ఇత‌ను ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతూ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు.