కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? పెద్ద బ్యానర్లు ఆయనతో పలు ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాయ్. అందులో కొన్ని బయటకు వచ్చాయ్. ఇంకొన్ని నిర్మాణ దశలో వున్నాయ్.
సినిమాకి సంబంధించి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాడనే మంచి ఒపీనియన్ ఒకప్పుడు కిరణ్ అబ్బవరం మీద వుండేది. అన్నీ అంటే, మాటలు అలాగ కథ, కథనం గురించి కూడా.!
కానీ, ఎక్కడో తేడా కొట్టింది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. యాటిట్యూడ్ అసలు సమస్య.. అంటూ రెండు సినిమాల క్రితమే ప్రచారం జరిగింది. కానీ, కుర్రాడు మారలేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులొస్తున్నాయ్.
వాట్ నెక్స్‌ట్.? అంటే, ముందైతే యాటిట్యూడ్ తగ్గించుకో.. అంటూ ఓ నిర్మాత, కిరణ్ అబ్బవరంకి సలహా ఇచ్చాడట. నిజానికి సలహాతో కూడిన హెచ్చరిక ఇది.! కుర్రాడైతే మంచోడే. కానీ, చుట్టూ వున్న ఓ కోటరీ వల్లనే ఆ సమస్య అట.
ఈ మధ్య చాలామంది యంగ్ హీరోలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.