ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రానున్న బిగ్గెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఇండియన్ సినిమా సహా తెలుగు సినిమాని గ్లోబల్ గా ఓ రేంజ్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల చిత్రమే అని చెప్పాలి. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది నుంచే స్టార్ట్ కానుండగా.
ఈ సినిమా అయితే ఓ భారీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా కొన్ని అప్డేట్స్ వైరల్ గా మారాయి. ఈ చిత్రం కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ అయితే ఈ జులై తో మొత్తం స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేస్తుండగా ఈ ఏడాది నవంబర్ నుంచే సినిమా స్టార్ట్ చేయనున్నారట.
అలాగే స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇండియానా జోన్స్ తరహాలోనే ఈ సినిమా ప్లాన్ చేస్తుండగా సినిమా క్లైమాక్స్ ని కూడా మేకర్స్ యూనిక్ గా రాసుకున్నారట. మరి ఈ భారీ క్లైమాక్స్ లో అయితే మరో భాగానికి ఛాన్స్ ఉండేలా ఇంట్రెస్టింగ్ హింట్ తో అయితే సినిమాని ముగిస్తారని తెలుస్తుంది.
దీనితో ఈ క్రేజీ క్లైమాక్స్ పై కూడా బజ్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే దర్శకుడు రాజమౌళి మినిమమ్ 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ హాలీవుడ్ నుంచి కొన్ని ప్రముఖ ఏక్షన్ బ్లాక్ సంస్థలు ఈ చిత్రంలో కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్స్ ల డిజైన్ కోసం రాజమౌళి సారథ్యంలో పని చేస్తున్నారు.