క్రేజీ – ఓటిటిలో “ఆనిమల్” అదనగంగా ఇంతసేపు..!

ఈ ఏడాది డిసెంబర్ రిలీజ్ కి వచ్చిన రీసెంట్ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యిన వాటిలో అయితే మొదటిగా వచ్చిన సినిమా “ఆనిమల్” కోసం తెలిసిందే ఎందరో బాలీవుడ్ సౌత్ స్టార్స్ కలయికలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన ఈ చిత్రం ఏ సర్టిఫికెట్ తో మూడున్నర గంటల నిడివితో అయితే వసూళ్ల వర్షం కురిపించింది.

కాగా ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు థియేటర్స్ లో ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ హై వోల్టేజ్ ఏక్షన్ డ్రామా ఓటిటి వెర్షన్ పై క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిత్రం ఇప్పటికే మూడు గంటల 20 నిమిషాలకి పైగా ఉంటే ఓటిటి  వెర్షన్ లో మరింత ఎక్కువ ఉంటుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఓటిటిలో ఈ సినిమాని రిలీజ్ చేసినపుడు అదనగంగా మరో 7 నుంచి 8 నిమిషాల కీలక సన్నివేశాలు యాడ్ చేస్తున్నారని తెలిసింది. దీనితో ఈ సినిమా ఓటిటి కోసం చూస్తున్నవారికి ఇది క్రేజీ న్యూస్ అని చెప్పాలి.

కాగా ఈ సినిమా హక్కలు ప్రముఖ సంస్థ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా అందులో ఈ సినిమా జనవరిలో వస్తుంది అని గాసిప్స్ ఉన్నాయి. మరి మొత్తానికి ఆనిమల్ మరింత ఎక్కువ మొత్తంలో రాబోతుంది అనేది ప్రస్తుతానికి అయితే కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ సినిమాలో త్రిప్తి దిమిరి, బాబీ డియోల్ ఇంకా అనీల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.