“ఆరెంజ్” రీ రిలీజ్ కి క్రేజీ రెస్పాన్స్.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా దీని కన్నా ముందు చేసిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో తాను ఏకంగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యిపోయాడు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన సరికొత్త ట్రెండ్ రీ రిలీజ్ లలో అయితే ఈ ఏడాది మార్చ్ 27న చరణ్ బర్త్ డే కి గాను తన కెరీర్ లో మొట్ట మొదటి ఇండస్ట్రీ హిట్ సినిమా అయినటువంటి “మగధీర” ని 4కే లో ప్లాన్ చేసారు.

కానీ తర్వాత అనూహ్యంగా తన కెరీర్ లో మగధీర లాంటి భారీ హిట్ తర్వాత వచ్చిన భారీ ప్లాప్ అయినటువంటి “ఆరెంజ్” సినిమాని తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకి ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాగా పెద్దగా రెస్పాన్స్ ఏమి ఉండదు అనుకునే వారికి అయితే షాకిచ్చేలా ఉంది.

ఈ సినిమాకి ఇప్పుడు హౌస్ ఫుల్స్ నమోదు అవుతుండడం విశేషం. ఆల్రెడీ హైదరాబాద్ లో క్రాస్ రోడ్స్ సహా ఇతర కీలక ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ అన్ని షోస్ హౌస్ ఫుల్స్ అయిపోయాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఫాస్ట్ ఫిల్లింగ్స్ ని ఆరెంజ్ నమోదు చేస్తుంది.

ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న బుకింగ్స్ ఓపెన్ చేయగా చాలా ఏరియాల్లో ఈ చిత్రం సాలిడ్ బుకింగ్స్ అయితే నమోదు అవుతున్నాయి. దీనితో ఈ ప్లాప్ సినిమా రీ రిలీజ్ లో మాత్రం అదరగొడుతుంది అని చెప్పక తప్పదు. కాగా ఈ మొత్తాన్ని అయితే మెగా ఫ్యాన్స్ జనసేన పార్టీ కి డొనేషన్ గా అందించనున్నారు.