ఇండస్ట్రీ టాక్ : “ఉస్తాద్ భగత్ సింగ్” అప్పటికి రెడీ అయిపోతాడా?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో ఒక్కోదాన్ని అయితే పవన్ వరుస గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న సాలిడ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ భారీ సినిమా కి సంబంధించి నిన్ననే మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా అందించారు.

కాగా ఇప్పుడు అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకో క్రేజీ రూమర్ అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో కానీ ఈ సినిమా అయితే వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేసేస్తారట. ఇంకా ఇందుకు చాలా సమయం ఉంది కానీ అసలు పవన్ కి ఉన్న బిజీ షెడ్యూల్ లో అయితే సినిమా అంత త్వరగా కంప్లీట్ అవ్వడం అనేది దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.

అలాగే ఒకవేళ గాని అప్పటికి వచ్చేస్తే అంతకు మించిన వండర్ కూడా ఇంకొకటి ఉండదని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాకి దర్శకుడు హరీష్ శంకర్ వర్క్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినేమయి భారీ బడ్జెట్ తో అయితే నిర్మాణం వహిస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ కి కూడా గ్రాండ్ ప్లానింగ్స్ ఉంటాయని కూడా టాక్ ఉంది.