క్రేజీ గాసిప్ : మహేష్ కోసం హాలీవుడ్ హీరోయిన్ ని లాక్ చేసిన రాజమౌళి?

ఇండియన్ సినిమా నుంచి రానున్న రోజుల్లో ఒక బిగ్గెస్ట్ అండ్ మాసెస్ట్ సినిమా కానీ కాంబినేషన్ కానీ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఎస్ ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ అనే చెప్పాలి. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఈ కాంబినేషన్ ఇప్పుడు ఎట్టకేలకు పట్టాలెక్కబోతుంది.

మరి ఈ సినిమా ఎలాగో పాన్ వరల్డ్ లెవెల్లో ఉంటుంది ఆ తరహా కాన్సెప్ట్ లోనే తెరకెక్కుతుంది అని అందరికీ తెలుసు. కాగా ఈ క్రమంలోనే ఆల్రెడీ రాజమౌళి పలు హాలీవుడ్ సంస్థలకి తన విజన్ తో కొన్ని పనులు కూడా అప్పగించాడు. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తారు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి.

కాగా ఇప్పుడు అదే తరహాలో ఓ కేజ్రి గాసిప్ వైరల్ అవుతుంది. దీనితో ఈ సినిమాలో మహేష్ సరసన జక్కన్న ఓ హాలీవుడ్ బ్యూటీని లాక్ చేసాడు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా అనే ఇండోనేషియాకి చెందిన ప్రముఖ నాటు చేల్సియా ఇస్లాన్ అన్నట్టుగా తెలుస్తుంది.

ఒకవేళ ఇది కానీ నిజం అయితే ఈ సినిమాని మేకర్స్ ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ రానున్న మరికొన్ని నెలల్లోనే స్టార్ట్ కానుంది. అలాగే షాకింగ్ బడ్జెట్ తో అయితే రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఓ భారీ ఏక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా అయితే ఈ సినిమాని వారు ప్లాన్ చేస్తున్నారు.