వర్మ ‘వ్యూహం’కి కౌంటర్ ఎటాక్.!

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వ్యూహం’ అనే సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్‌గా. జగన్ గత ఎలక్షన్స్ టైమ్‌లో జరిగిన వ్యూహ ప్రతివ్యూహాల నేపథ్యంలో ఈ సినిమా కథ వుండబోతోందనీ ప్రచారం.

అలాగే, లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆర్టిస్టుల పోస్టర్లు సైతం రిలీజ్ చేసి ఆయన అనుకున్న సెన్సేషన్ అయితే సాధించారనే చెప్పాలి రామ్ గోపాల్ వర్మ. అచ్చు గుద్దినట్లుగా జగన్, ఆయన భార్య భారతిలను పోలిన క్యారెక్టర్లతో పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు సంగతి ఏంటంటే, ఇప్పుడీ సినిమాకి కౌంటర్ ఎటాక్‌గా ఇంకో సినిమా రాబోతోందనీ తాజా గాసిప్.

‘వ్యామోహం’ అనే టైటిల్‌తో ఆ సినిమా వుండబోతోందట. అయితే, ఎవరు తెరకెక్కిస్తారు.? ఏంటీ.? అనేది తెలియాల్సి వుంది. కాగా, గతంలో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమాకి కూడా ఇలాగే కౌంటర్ ఇస్తూ మరో సినిమా వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.