శివ కార్తికేయన్ కి సుధా కొంగరకి మధ్య తలెత్తిన విభేదాలు.. నిజమేనా?

ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ 25వ చిత్రం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కోలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఈ సినిమాలో విలన్ గా మరొక తమిళ హీరో జయం రవి నటిస్తున్నాడని తెలిసి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే సీన్స్ హైలెట్ గా ఉంటాయి అంటున్నారు మూవీ టీం. ఇక ఈ సినిమాలో విలన్ గా మలయాళం నటుడు రోషన్ మాథ్యూ ఫిక్స్ అయిన విషయం కూడా తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో స్టార్ట్ కాబోతుందని ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఇప్పుడు కొత్తగా అందిన సమాచారం ఏమిటంటే బుధవారం ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ చేయటానికి చిత్ర యూనిట్ రెడీ అయిందట అయితే దర్శకురాలు సుధా కొంగర నటుడు శివ కార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమోషూట్ రద్దు అయినట్లు తెలుస్తోంది.

షూటింగ్ కి శివ కార్తికేయన్ పూర్తి గడ్డంతో రావడం తో గడ్డం తొలగించి రావాలని సుధా కొంగర చెప్పినట్లు తెలుస్తోంది. అయితేకథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు అని శివ కార్తికేయన్ తనవైపు వాదన వినిపించాడు. అయితే సుధాకర్ లైట్ బియార్డ్ తో ఉండాలి అని చెప్తే పరుత్తివరం లో కార్తీ మాదిరి ఇలా ఉంటే ఎలా అని దర్శకురాలు అసహనం వ్యక్తం చేసిందట.

ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని శివ కార్తికేయన్ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఇది. ఇందులో ఎంతవరకు నిజం, ఏది అబద్దం అనేది తెలియాల్సి ఉంది. మూవీ టీం అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సమస్యలన్నీ తీరి షూటింగ్ ప్రారంభించాలని ఆశిద్దాం.