Devi Sri Prasad: ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా స్పెషల్ సాంగ్స్ కారణంగా సినిమాకు మంచి హైప్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క దర్శకుడు సైతం సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పుష్ప 2 సినిమాలో కూడా కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.
ఇకపోతే ఈ పాటపై ఫస్ట్ లో చాలా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్ గురించి డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పుష్ప పార్ట్ వన్ సినిమాలో సమంత చేసిన ఊ అంటావా ఉఊ అంటావా అనేది ఆడియన్స్ కి వెంటనే నచ్చేసింది. కానీ కిస్సిక్ పాటపై మాత్రం విమర్శలు రావడంతో అందుకు గల కారణాన్ని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.
ఊ అంటావా ఉఊ అంటావా పాటతో పోల్చి ‘కిస్సిక్’ ని తక్కువ చేస్తారని నేను ముందుగానే ఊహించానని తెలిపారు.
నేను వందల కొద్ది రొమాంటిక్ సాంగ్స్ చేశాను అయితే అవి దేనికవే ప్రత్యేకత కానీ ఐటమ్ సాంగ్స్ విషయంలో అలా ఉండదని తెలిపారు. కచ్చితంగా కొత్త పాటలు పాత పాటతో పోల్చి చూస్తారని ఇక సీక్వెల్ సినిమాలు వస్తే ఈ పోలికలు మరింత ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కిసిక్ పాట సినిమాలోని కథ ఆధారంగా వచ్చింది. పైగా ఇందులో అమ్మాయి ఫోటో గురించి కాన్సెప్ట్ వైజ్ చెప్పడం కూడా జరిగింది. దానికి తగ్గట్టు ట్యూన్ డిజైన్ చేసుకోవడం జరిగింది. అది జనాలకి ఎక్కడానికి టైం పడుతుంది అని ముందుగానే ఊహించాను.
ఇకపోతే ఊ అంటావా ఉఊ అంటావా అనేది ఆడియన్స్ కి వెంటనే ఎక్కేసింది. అందులో అబ్బాయిల పై సెటైర్లు కూడా ఉంటాయి కనుక ఈ పాట తొందరగా ప్రేక్షకులకు నచ్చేసిందని తెలిపారు. అలాగే మనం ఆల్రెడీ వాడిన ట్యూన్స్ కనుక కొత్త పాటలకి అప్లై చేస్తే.. వెంటనే ఎక్కేస్తాయి అంటూ దేవి శ్రీ ప్రసాద్ ఈ రెండు స్పెషల్ సాంగ్స్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.