స్టార్ హీరోతో రూమర్స్.. బెదిరింపులు రావడంతో చట్టపరమైన చర్యల‌కు సిద్దమైన గాయని!

Star Hero: కోలీవుడ్‌లో గాయని కెనీషా పేరు ఇటీవల విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. నటుడు జయం రవితో ఆమెకు సంబంధం ఉందన్న వార్తల నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయి. తాజాగా ఈ బెదిరింపుల హద్దులు దాటడంతో కెనీషా కోపం అట్టుడుకుతోంది. తనపై అశ్లీలంగా, అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆమె లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న అసభ్య మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లను ఆధారంగా తీసుకుని చట్టపరంగా చర్యలు ప్రారంభించారు. కెనీషా టీమ్ నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం, “ఆన్‌లైన్ వేధింపులు, అత్యాచార బెదిరింపులు వంటి విషయాల్లో ఏమాత్రం ఉపేక్షించం. ఆమె పరువు, గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవు” అని తెలిపారు.

తాజాగా కెనీషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎమోషనల్ పోస్ట్ ఒకటి షేర్ చేస్తూ, “నన్ను ద్వేషించడం ఆపండి. నేను ఏ తప్పూ చేయలేదని త్వరలోనే నిరూపితమవుతుంది. దేవుడిని ప్రార్థిస్తున్నా.. నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి” అంటూ వేదనతో పేర్కొన్నారు. ఆమె మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు చూస్తే, ఆన్‌లైన్‌లో జరుగుతున్న వేధింపులు ఎంత హద్దు దాటి పోయాయో అర్థమవుతోంది. జయం రవితో ఉన్న అనుబంధంపై ఆమె ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ, ఆ వార్తలే ఈ వేధింపులకు కారణమై ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

వంశీకి ఏదైనా జరిగితే || Producer Chitti Babu EXPOSED Vallabhaneni Vamsi Arrest & Health  || TR