మహేష్ – త్రివిక్రమ్ సినిమాపై మళ్ళీ అవే రూమర్లు.!

ఏమయ్యింది మహేష్‌బాబు తాజా సినిమాకి.? తన ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తోన్న సినిమాకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటంకాలొస్తున్నాయ్.!

కొన్ని నెలల క్రితం సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, అనివార్య కారణాల వల్ల పెద్ద ‘గ్యాప్’ వచ్చేసింది.ఇక, ఈసారి ఎలాంటి ‘గ్యాప్స్’కీ అవకాశం లేకుండా లాంగ్ షెడ్యూల్స్‌తో సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసెయ్యాలని అటు నిర్మాణ సంస్థ, ఇటు త్రివిక్రమ్, ఇంకోపక్క మహేష్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, షూటింగ్ స్పాట్ నుంచి ఫొటోలు లీక్ అయిపోతున్నాయ్. కథ ఇదేనంట కదా.. అంటూ స్టోరీ లీకులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఓ యెత్తు.. సినిమా సరిగ్గా రావడంలేదన్న ప్రచారం మరో వైపు. మళ్ళీ బ్రేక్ పడబోతోందట షూటింగుకి.. అన్నది తాజాగా ప్రచారంలో వున్న గాసిప్. ఇందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌కే ఎందుకీ తలనొప్పి.? అని అభిమానులు గుస్సా అవుతున్నారు.

తాజా ఖబర్ ఏంటంటే, ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేదట. ఆగస్ట్ అన్నారుగానీ, సాధ్యం కాకపోవచ్చునట.