కామెడీ.. యాక్షన్ లో డబుల్ డోస్ అంటున్న డి అండ్ డి..!

మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ఢీ సినిమాకి సీక్వెల్ రాబోతుందంటూ ఇటీవల మంచు విష్ణు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ని మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. డి & డి (D & D) టైటిల్ గా ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ ఈ టైటిల్ కి “డబుల్ డోస్” అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. డబుల్ డోస్ ఉపశీర్షికతో ఢీ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రం కంటే డబుల్ డోస్ యాక్షన్ కామెడీ ఉంటుందని దర్శకుడు శ్రీను వైట్ల, హీరో మంచు విష్ణు అంటున్నారు.

Vishnu Manchu And Sreenu Vaitla Dhee Sequel

ఇక ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో విష్ణు మంచు నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. కాగా ఢీ సినిమాలో హీరోయిన్ గా జెనీలియా నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది సహా మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తారని చెప్పుకొచ్చారు మేకర్స్.

Image

ఇక ప్రస్తుతం మంచు విష్ణు మోసగాళ్ళు అన్న పాన్ ఇండియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో విష్ణు కి సోదరిగా నటిస్తుండటం విశేషం. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రధానంగా ఇంగ్లీష్ .. తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మిగతా భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు.