మరీ కరువు మీదున్నట్టున్నారు.. హగ్గుల కోసం హైపర్ ఆది, సుధీర్ ఆరాటం

Hyper Aadi sudheer Hugs To Priyamani And rashmi In Dhee

ఢీ షోలో ఒకప్పుడు డ్యాన్సులు మాత్రమే వచ్చేవి. ఆ డ్యాన్సుల్లో కూడా ఒకప్పుడు కనిపించినట్టుగా లేదు.. ఇప్పుడంతా కూడా జిమ్నాస్టిక్ సర్కస్ ఫీట్లు చేసినట్టుగానే ఉంటున్నాయి. వీటికి తోడు ఇప్పుడు జబర్దస్త్ తరహాలో ఫన్నీ స్కిట్స్ ఎక్కువయ్యాయి. కొన్ని కొన్ని ఎపిసోడ్స్‌లో డ్యాన్స్ కంటే కామెడీ స్కిట్సే ఎక్కువగా ఉంటాయి. సుధీర్, రష్మీ, హైపర్ ఆది, ప్రదీప్ ఇలా అందరూ కలిసి కామెడీతో రచ్చ రచ్చ చేస్తుంటారు.

Hyper Aadi sudheer Hugs To Priyamani And rashmi In Dhee

ఒకప్పుడు రష్మీ సుధీర్ ఢీ షోలో సందడి చేసేశారు. ఆ తరువాత ఆది వర్షిణి కలిసి రచ్చ చేసేవారు. మధ్యలో ప్రదీప్ పూర్ణ, ప్రదీప్ ప్రియమణి, శేఖర్ మాస్టర్ ప్రియమణి ట్రాకులను కూడా ఎంకరేజ్ చేశారు. కానీ చివరి వరకు నిలబడింది మాత్రం రష్మీ సుధీర్ జోడీయే. ఢీ పదమూడో సీజన్‌లో కింగ్స్ వర్సెస్ క్వీన్ అంటూ మొదలుపెట్టారు. ఈ సీజన్ మొదట్లోనే ప్రియమణిపై ఆది కర్చీప్ వేసేశాడు. ప్రియా అంటూ పిలుస్తాను అంటూ చెప్పేసి ఫ్లర్ట్ చేయడం మొదలెట్టేశాడు.

ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆవిడ చేత ఆది తన కోరికలను బయట పెట్టించాడు. ప్రియా.. వచ్చి ఆదిని హగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పించాడు. స్టేజ్ మీద నుంచి దిగి వచ్చిన ప్రియమణి ఆదికి హగ్ ఇస్తున్నట్టుగానే వచ్చింది. కానీ చివరకు ఆ పెద్దావిడకు హగ్ ఇచ్చింది. ఇక చివరకు సుధీర్ కూడా తనలోని కోరికను ఆ పెద్దావిడ ద్వారా బయటపెట్టించాడు. రష్మీ.. సుధీర్‌కు ఓ హగ్ ఇవ్వొచ్చు కదా అని అడిగించాడు. మొత్తానికి ఈ ఇద్దరూ హగ్గులు లేక తెగ బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.