అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు, భరత్ అనే నేను సినిమాల ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. ఇలా పలు తెలుగు సినిమాలలో కమెడియన్ గానటిస్తూ ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు అయితే సోషల్ మీడియాలో ఈయన చేసే వివాదాస్పద పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం ఈయన ఓ అమ్మాయిని ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తనకు కాబోయే భార్య గురించి పరిచయం చేశారు.ఇలా తనకు కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన రాహుల్ రామకృష్ణ తాను పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడ వెల్లడించలేదు. ఇలా తను పెళ్లి గురించి ఫోటోలు కానీ వీడియోలు కానీ అభిమానులతో పంచుకోని రాహుల్ రామకృష్ణ తాజాగా సోషల్ మీడియా వేదికగా తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఈయన తన భార్య గర్భవతిగా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ మీట్ అవర్ లిటిల్ ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈయన తండ్రి కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవడంతో ఎంతోమంది నేటిజన్ లు అసలు రాహుల్ రామకృష్ణ పెళ్లెప్పుడు చేసుకున్నారు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.