ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమెడియన్ ప్రభాస్ శ్రీను…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో కమీడియన్ విలన్ పాత్రలలో నటించిన ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ శీను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో ప్రభాస్ తో ఉన్న మంచి స్నేహం వల్ల ప్రభాస్ పేరుని తన పేరు ముందు పెట్టుకొని ప్రభాస్ శ్రీనుగా గుర్తింపు పొందాడు. అయితే గత కొంతకాలంగా ప్రభాస్, శ్రీను ఇద్దరూ కూడా దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు రావటం వల్ల వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల కృష్ణంరాజు మరణించిన సమయంలో తెరపైకి వచ్చిన ప్రభాస్ శ్రీను ప్రభాస్ వెన్నంటే ఉంటూ అన్ని పనులలో తోడుగా నిలిచాడు. అయితే ప్రభాస్ శ్రీను మధ్యాహ్నం ఉన్న గొడవల గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ… ప్రభాస్ కి తనకి మధ్య ఎటువంటి గొడవలు లేవని.. మేమిద్దరం ఎప్పటిలాగే స్నేహంగా ఉంటున్నామని శ్రీను చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా సోషల్ మీడియాలో మా ఇద్దరి మధ్య మాటలు లేనట్లు వినిపిస్తున్న వార్తలలో ఎటువంటి నిజాలు లేవని ఈ సందర్భంగా శ్రీను క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లాంటి గొప్ప వ్యక్తితో గొడవ పడి దూరం కావాలని ఎవరు కోరుకోరు అంటూ చెప్పుకొచ్చాడు. వైజాగ్ లో సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకునే సమయం నుండి ఇప్పటివరకు మేమిద్దరం మంచి స్నేహితులు. ప్రభాస్ అప్పుడు ఎలా ఉన్నాడు స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.