ఆ ప్రశ్నలు రేపుతున్న పవన్ – బాలయ్య సంచలన మీటింగ్.!

టాలీవుడ్ ఇద్దరు గాడ్ ఆఫ్ మాస్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ లు కోసం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడో వీరి మధ్య కొన్ని కోల్డ్ వార్ లు ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అప్పట్లో ఒకరిపై ఒకరు కామెంట్ చేయడం మెగా బ్రదర్స్ కూడా గట్టి రిప్లై లు ఇవ్వడం చాలానే జరిగాయి.

ఇక ఇదిలా ఉండగా ఇద్దరు కూడా ఇప్పుడు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు అలాగే మరోపక్క కూడా రాజకీయ పనులు చూసుకుంటున్నారు. అయితే నిన్ననే పవన్ కళ్యాణ్ బాలయ్య తాజా చిత్రం “వీరసింహా రెడ్డి” సాంగ్ సెట్స్ లో సందడి చేయడం ఒక్కసారిగా నందమూరి మరియు మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది.

ఇన్ని రోజులు కొట్టుకున్న తాము ఈ ఇద్దరి సంచలన కలయికతో ఒక్కసారిగా పాజిటివ్ గా మారిపోయారు. అయితే ఈ మీట్ ఉద్దేశం ఏంటి అనేది పక్కన పెడితే అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. మరి ఎక్కువగా అయితే పొలిటికల్ పరంగానే ఈ మీటింగ్ వెనుక ఉద్దేశం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరి దీనికి అయితే సినిమా అడ్డం పెట్టుకొని పవన్ వెళ్లడని కొందరి వాదన. కానీ కొంతమంది మాత్రం ఇది ఖచ్చితంగా పొలిటికల్ గా కలిసి నడిచేందుకే అని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ ఊహించని కలయిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.