ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ బిగ్ రిలీజ్ లలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ చిత్రం “భోళా శంకర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా వచ్చే శుక్రవారం అయితే ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
కాగా ఈ గ్యాప్ లో అయితే చిత్ర యూనిట్ మంచి ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా లేటెస్ట్ గా అయితే బుల్లితెర నటుడు గెటప్ శ్రీను తో సినిమా మెయిన్ యూనిట్ ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. కాగా ఈ ఇంటర్వ్యూ లో అయితే చిరు కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు హీరోయిన్ తమన్నా విషయంలో చెప్పారు.
అయితే తనని కలిసిన చాలా హీరోయిన్స్ కానీ లేడీ ఫ్యాన్స్ కానీ ఎప్పుడు నన్ను ఐ లైక్ యు అని చెప్తూ ఉంటారు అని కానీ ఒక్క తమన్నా మాత్రం ఆ మాట నాకు ఎన్నడూ చెప్పలేదు. ఈ అమ్మాయి ఐ లైక్ యు అని ఎప్పుడు చెప్పలేదు కానీ ఐ లవ్ యు అని మాత్రం చెప్తుంది అని ఆమె అలా చెప్పడంతో నేను మొదటి అక్కడికక్కడే ఫ్లాట్ అయిపోయా అని చిరు తెలిపారు.
అయితే దీనిపై తమన్నా కూడా మాట్లాడుతూ నాకు నిజంగానే అలా చెప్పాలి అనిపిస్తుంది అని అది ఆయన మీద రెస్పాక్ట్ తోనే అని కాదు ఆయనతో వర్క్ చేస్తున్నపుడు అయన సెట్స్ లో ఉండే విధానం యాక్ట్ చేసే విధానం అన్నీ నాకు బాగా నచ్చుతాయి అందుకే అయన విషయంలో మాత్రం లవ్ యు సర్ అని నేను చెప్తాను అని మిల్కీ బ్యూటీ సెలవిచ్చింది. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా నటించగా ఆమె సినిమాలో చిరు కి సిస్టర్ రోల్ లో నటించింది. కాగా అనీల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాణం వహించారు.