డియర్‌ దేవా..బాక్సాఫీస్‌ ఫైర్‌.. సలార్‌పై చిరు ప్రశంసలు!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సలార్‌ భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో భారీ ఓపెనింగ్స్‌ రాబడుతున్నది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

అయితే ఈ సినిమా చూసిన మెగాస్టార్‌ చిరంజీవి సలార్‌పై ప్రశంసలు కురిపించాడు. డియర్‌ దేవా (ప్రభాస్‌)కి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సలార్‌ సీజ్‌ ఫైర్‌ బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతుంది. అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కు కుడోస్‌.

పృథ్విరాజ్‌ సుకుమారన్‌, శృతి హాసన్‌, జగపతి బాబు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. మిగతా టెక్నీకల్‌ టీం అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికీ అభినందనలు అంటూ చిరు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇక ఈ మూవీకి చిరు రివ్యూ ఇవ్వడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సంతోషంలో మునిగిపోతున్నారు.