ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు.. మీటూ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొంటుంది. తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ చెబుతుంది. ఏమాత్రం భయపడదు. ఎదుటి వారు ఎంతటి వారు అయినా సరే.. వాళ్లను వదిలిపెట్టదు.
అప్పట్లో తమిళ సాహిత్య రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేసింది. వైరముత్తు ఫారిన్ వెళ్లిన సమయంలో ఓసారి తన గదిలోకి రావాలంటూ వేరే వాళ్లతో చెప్పి పంపాడని చిన్మయి ఆరోపణలు చేసింది. ఆ విషయం అప్పట్లో కోలీవుడ్ లో పెద్ద సంచలనమే అయింది. చిన్మయి నోరు విప్పాక.. చాలామంది మహిళలు కూడా నోరు విప్పారు. వైరముత్తుపై ఆరోపణలు చేశారు. వైరముత్తు ఆ ఆరోపణలను ఖండించారు. ఆ తర్వాత చిన్మయికి కోలీవుడ్ లో ఎటువంటి ఆఫర్లు రాకుండా చేశాడు. అయినా కూడా చిన్మయి ఇప్పటికీ అతడిపై పోరాటం చేస్తూనే ఉన్నది.
తాజాగా మరోసారి వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసింది. ఓ యువతిపై వైరముత్తు ఎటువంటి వేధింపులు చేశాడో బయటపెట్టింది. రెండేళ్ల క్రితమే.. మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలోనే ఓ యువతి.. చిన్మయికి వైరముత్తు తనపై చేసిన వేధింపుల గురించి చెప్పుకుంది. అయితే.. ఆ మహిళ తనకు జరిగిన వేధింపుల విషయంలో తన పేరు బయటికి రావద్దని.. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియకూడదని చిన్మయిని వేడుకుంది.
దీంతో రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత… తాజాగా ఆ యువతి పంపిన మెసేజ్ లను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది చిన్మయి.
మీటూ ఉద్యమంలో మీకు చాలా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి.. నాకు జరిగిన అన్యాయన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. కానీ.. దీంట్లో నా పేరు బయటికి రాకూడదు. మా కుటుంబ సభ్యులు దీనికి ఒప్పుకోరు. నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లా. అక్కడ వైరముత్తు ఉంటే ఆయన ఆటోగ్రాఫ్ అడిగా. ఆయన ఆటోగ్రాఫ్ తో పాటు తన ఫోన్ నెంబర్ కూడా రాసిచ్చాడు. అప్పుడు నాకు 17 ఏళ్లు మాత్రమే. కానీ.. నాకు ఆయన తన నెంబర్ ఎందుకు రాసిచ్చాడో అర్థం కాలేదు.
తర్వాత నేను ఓ తమిళ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న సమయంలో వైరముత్తు మా చానెల్ కు వచ్చాడు. నన్ను కలిశాడు. అప్పుడు నా ఫోన్ నెంబర్ అడిగాడు. నేను ఇచ్చేశా. అంతే.. అప్పటి నుంచి నాకు ఫోన్లు చేయడం, మెసేజ్ లు చేయడం.. మౌంట్ రోడ్డు దగ్గరున్న ఓ ప్రాంతానికి రావాలంటూ రోజూ విసిగించేవాడు. నెంబర్ మార్చేసినా.. ఎలాగైనా నా నెంబర్ తెలుసుకొని ఫోన్లు చేసి విసిగించేవాడు. ఈ విషయం నేను పనిచేసే చానెల్ యజమానులకు చెప్పా. దీంతో వాళ్లు ఆయన భార్యతో మాట్లాడారు. దీంతో వైరముత్తు భార్య ఆయన నోరు మూయించింది.. అంటూ ఈ విషయాన్ని చిన్మయికి ఆ యువతి చెప్పుకొచ్చింది.
Almost 2 years since the second wave of the #MeToo movement.
#17
It took her 2 years to open up to me because her family doesn’t support. Have known her for years.
And of course, does it even matter to the peeps of this society? pic.twitter.com/65sXyqUMK3
— Chinmayi Sripaada (@Chinmayi) October 13, 2020