సింగర్ చిన్మయి మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని భుజాన వేసుకున్న సంగతి తెలిసిందే. బయటకు చెప్పుకోలేని ఎంతో మంది అమ్మాయిలకు చిన్మయి గొంతుగా మారింది. వారి బాధలను బయటకు చెప్పుకునేందుకు చిన్మయి దారి చూపుతోంది. ఎంతో ఆడపిల్లలు, మహిళలు తాము పడిన బాధలను, చూసిన నరకాన్ని చిన్మయితో పంచుకుంటారు. చిన్మయి వాటిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది.
తాజాగా అలాంటి ఓ ఘటనే చిన్మయి షేర్ చేసింది. హైద్రాబాద్‌లోని కాలేజ్‌లు, లేడీస్ హాస్టళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఓ అమ్మాయి వివరంగా చెప్పింది. ఆమె షేర్ చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది.. హాలో మేడమ్.. నా పదో తరగతి అది 2015.. నా హైద్రాబాద్‌లోని ఓ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఇలాంటి ఘటనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అక్కడి వార్డెన్ దారుణంగా ప్రవర్తిస్తుంటుంది. మేము పీరియడ్స్ అని చెప్పినా కూడా వినకుండా.. అబద్దాలు ఆడుతున్నామేమో అని అనుమాన పడుతూ.. విప్పి చూపించమనేది.
ఒకసారి నాక్కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. క్లాసులో ఉండగా నాకు పీరియడ్ స్టార్ట్ అయింది. వెంటనే హాస్టల్‌కు వెళ్లాను. కానీ నన్ను రెస్ట్ రూంలోకి వెళ్లనివ్వలేదు. ఎంత చెప్పినా వినలేదు. విప్పి చూపించమని ఆర్డర్ వేసింది.నేను చూపించాను.. లోదుస్తులపై ఉన్న రక్తాన్ని చూసి అప్పుడామే నమ్మింది. ఆ తరువాతే లోపలికి వెళ్లనిచ్చింది.. ఆ తరువాతే విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించింది అంటూ ఓ అమ్మాయి చెప్పిన ఘటనను చిన్మయి షేర్ చేసింది.