యాదృచ్చికం : ఒకే రోజు కంప్లీట్ చేసిన చరణ్, పవన్ లు.!

Surprising-Statement-from-Pawan-Kalyan-for-Ram-Charan

టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా ఒకరు. మరి ఈ ఇద్దరు బాబాయ్ అబ్బాయి లు కూడా తమ భారీ సినిమాలు చేస్తుండగా ఈ సినిమాల్లో పవన్ రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఓ రీమేక్ సినిమా కూడా ఒకటి కాగా రామ్ చరణ్ అయితే సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో చేస్తున్నాడు.

అయితే ఇంట్రెస్టింగ్ గా ఒకే రోజు ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాల్లో కీలక అంశాలు కంప్లీట్ చేయడం యాధృచ్చికంగా మారింది. మరి సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ మొత్తం 20 రోజులు ఆలా డేట్స్ ఇవ్వగా సరిగ్గా నిన్నటితో అయితే పవన్ పై మొత్తం టాకీ పార్ట్ కంప్లీట్ చేసేసినట్టుగా స్వయంగా సముద్రఖని నిన్న బిగ్ అప్డేట్ అందించగా.

ఇక నెక్స్ట్ అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఓ భారీ సాంగ్ షూట్ కూడా నిన్ననే కంప్లీట్ అయ్యింది. దీనితో బాబాయ్ అబ్బాయి ల సినిమాల్లో కీలక ఘట్టాలు నిన్ననే కంప్లీట్ కావడం మెగా ఫ్యాన్స్ లో విశేషంగా మారింది. ఇక RC15 సెట్స్ లో అయితే రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు కూడా మేకర్స్ భారీ ఎత్తున సెలెబ్రేషన్స్ తో జరపగా అందులో దిల్ రాజు శంకర్ ప్రభుదేవా, కియారా అద్వానీ కూడా పాల్గొన్నారు. దీనితో అటు పవన్ ఇటు చరణ్ ఫొటోస్ వైరల్ గా మారాయి.