జిమ్ లో తెగ కష్టపడుతున్న చైతన్య,నిహారిక.. ఫొటోస్ వైరల్..?

మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో నిహారికతో పాటు భర్త చైతన్య కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పబ్బు వ్యవహారంతో నిహారిక పేరు మారుమోగిపోయింది విషయం తెలిసిందే. ఆ సమయంలో నిహారిక ని తిడుతూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే పబ్బు వ్యవహారం తర్వాత కొద్దిరోజుల పాటు నిహారిక పేరు ఎక్కడ వినిపించలేదు. ఆ తర్వాత ఇటీవల తాజాగా నిహారిక తన భర్త చైతన్యకు పబ్లిక్ గా నే లిప్ కిస్ ఇవ్వడంతో ఆ ఫోటోలు కాస్త తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా తన భర్త చైతన్య తో కలసి జోర్డాన్ కు వెళ్లిన నిహారిక అక్కడి ఫోటోలను పంచుకుంది. అక్కడే వారానికి పైగా వెకేషన్ ను ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నిహారిక మళ్లీ ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో తాను మూడు విషయాల గురించి నేర్చుకున్నాను అంటూ తనపై వచ్చిన కాంట్రవర్సీలు మీద పరోక్షంగా రియాక్ట్ అయ్యింది.. ఇక ప్రస్తుతం తన భర్త జొన్నలగడ్డ చైతన్య తో కలసి జిమ్ లో తెగ కష్టపడుతుంది. ఇక చైతన్య అయితే బీస్ట్ మోడల్ లోకి మారిపోయాడు.

చైతన్య తో పాటు నిహారిక కూడా జిమ్ కి వస్తోంది. తాజాగా తన జిమ్ ట్రైనర్ గురించి చెప్పుకొచ్చారు. తమ జిమ్ ట్రైనర్ కొత్తగా సెంటర్ ను ఓపెన్ చేశాడు అంటూ నిహారిక, చైతన్య లు చెప్పుకొచ్చారు. అతనికి కంగ్రాట్స్ చెబుతూ కొత్త జిమ్ సెంటర్ ను చూపించారు. ఇకపోతే నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.