Ram Gopal Varma : సెన్సార్ పరిమితులపై మరోసారి తనదైన శైలిలో స్పందించాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, సినిమాల్లో బూతు డైలాగులు, హింసాత్మక దృశ్యాలపై అభ్యంతరాలు తెలిపే వారిని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. అందులో ఏదైనా చూసే అవకాశం ఉంది. అలాంటప్పుడు, సినిమాల్లోని కొన్ని దృశ్యాల్ని తప్పుపట్టడం విడ్డూరం’’ అని వ్యాఖ్యానించారు.
‘‘ఫోన్‌లో **ర్న్ చూస్తే తప్పులేదు? అదే దృశ్యాన్ని సినిమా తెరపై చూపిస్తే తప్పా? ఈ డబుల్ స్టాండర్డ్‌ను ఎవరూ ప్రశ్నించడం లేదు. సెన్సార్ బోర్డు కొన్ని రూల్స్ పెడుతోంది. కానీ అవన్నీ బయట జీవితం చూస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. అసలు మనం జీవిస్తున్న సమాజంలో ఎలా ఉన్నామో గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని వర్మ తన అభిప్రాయం వెల్లడించారు.
సెన్సార్ వ్యవస్థను తీవ్రంగా తప్పుబడుతూ, ‘‘ఇది ఎప్పుడో చెల్లిపోయిన వ్యవస్థ. ఒక స్టూపిడ్ వ్యవస్థ. ఒక శిల్పంలా ఉండిపోయింది. సినిమాను కేవలం ఒక వినోదమూల్యంతో చూడకపోతే, దాన్ని జడ్జ్ చేయడం తగదు. ప్రేక్షకులకు తమది అని అనిపించేదే సినిమాలు. వాళ్లే నిర్ణయించాలి ఏం చూడాలో’’ అన్నారు.
వర్మ వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి సెన్సార్ బోర్డునే నేరుగా టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఆయన సినిమాల్లో బోల్డ్ కంటెంట్‌కు ఎప్పుడూ దూరం లేకుండా ఉంటారు. ఈ వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీలో వేరే దిశగా స్పందన వస్తుందా, లేక అధికారికంగా బోర్డు ఏదైనా స్పష్టం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.