ఇండస్ట్రీ టాక్ : “కెమెరా మెన్ గంగతో రాంబాబు”ని దింపబోతున్నారా?

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పవన్ ఎక్కువ రాజకీయాలు మీదే దృష్టి పెట్టగా ప్రస్తుత సినిమాలు అన్నీ షెడ్ లోనే ఉన్నాయి.

కాగా ఈ చిత్రాలు అన్నీ కూడా ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికలు తర్వాత మాత్రమే వస్తాయని ఫిక్స్ అయ్యింది. అయితే టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ లో ఈ పవన్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కాగా ఈ లిస్ట్ లో అయితే ఇప్పుడు మరో చిత్రం యాడ్ అవుతున్నట్టుగా సినీ వర్గాలలో గట్టి టాక్ వినిపిస్తుంది.

దీనితో ఆ సినిమానే “కెమెరా మెన్ గంగతో రాంబాబు” అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిబ్రవరి లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఫిబ్రవరి 2 నుంచి 9 మధ్య లలో అలా రిలీజ్ సన్నాహాలు చేస్తున్నారట.

అయితే ఇక్కడ ఇదే టైం లో ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అలాగే తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల జీవిత చరిత్రపై తీసిన చిత్రం “యాత్ర 2” కూడా ఉంది. కాగా ఈ చిత్రానికి పోటీగా పవన్ సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్ పని చేయగా తమన్నా హీరోయిన్ గా నటించింది.

అలాగే 2012 లో రిలీజ్ అయ్యిన ఈ పొలిటికల్ డ్రామా అప్పుడే ఎన్నో కాంట్రవర్సీలతో కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. అలాగే ఆ సినిమాతోనే పవన్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు.