నెటిజన్స్ చేసిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చిన బన్నీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సైమా అవార్డ్ అందుకున్నాడు. పుష్ప సినిమాలు తన అద్భుతమైన నటనకు ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇటీవల బెంగళూరులో రెండు రోజులపాటు నిర్వహించిన సైమా అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడు గా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు మరణించడంతో యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగి ఉంటే అల్లు అర్జున్ మాత్రం అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు.

దీంతో నెటిజన్స్ అల్లు అర్జున్ మీద తీవ్ర విమర్శలు కురిపించారు. సొంత ఇండస్ట్రీకి చెందిన ఒక గొప్ప నటుడు మరణిస్తే కనీసం ఆయనకు సంతాపం తెలుపుతూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదంటూ నెటిజన్స్ అల్లు అర్జున్ మీద మండిపడుతూ విమర్శలు చేశారు. అంతె కాకుండా చిరంజీవి ఎన్టీఆర్ మహేష్ బాబు కృష్ణ వంటి స్టార్ హీరోలు సైతం కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించుకుని నివాళులు అర్పించారు. దీంతో అల్లు అర్జున్ కృష్ణంరాజు మృతదేహాన్ని కూడా చూడటానికి రాలేదంటూ విమర్శలు చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం వారి విమర్శలకు స్పందించకుండా అందరి నోళ్ళు మూయించాడు.

సైమా అవార్డు ఫంక్షన్ కోసం బెంగళూరు వెళ్ళిన నా అల్లు అర్జున్ అక్కడినుండి సరాసరి హైదరాబాద్ చేరుకొని తన ఇంటికి కూడా వెళ్లకుండా కృష్ణంరాజు పార్తివదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించాడు. తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. ఎంతో అభిమానంగా చూసుకున్న తన పెదనాన్నను కోల్పోయి బాధలో ఉన్న ప్రభాస్ ని కూడా ఓదార్చి తన స్నేహితుడి మొహంలో చిరునవ్వు వచ్చేలా చేశాడు. ఇలా నెటిజన్స్ చేసిన విమర్శలకు నోటితో కాకుండా తన చేతులతో గట్టిగా సమధానం చెప్పాడు.