“బ్రో” టీజర్ పై క్రేజీ అప్డేట్ వదిలిన మేకర్స్.!

ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా ఖచ్చితంగా గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఓ డివోషనల్ ట్రెండీ ఎంటర్టైనర్ చిత్రం “బ్రో ది అవతార్” అనే చెప్పాలి.

కాగా ఈ చిత్రంతోనే నటుడు సముద్రఖని టాలీవుడ్ కి దర్శకునిగా కూడా పరిచయం అవుతూ ఉండగా ఈ సినిమాని అదిరే లెవెల్లో అయితే తీర్చి దిద్దుతున్నారు. ఇక ఈ చిత్రం అయితే ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సహా మోషన్ పోస్టర్ టీజర్ లు మంచి రెస్పాన్స్ అందుకోగా ఈ చిత్రం టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరి ఈ టీజర్ పై అయితే అప్డేట్ ఈ వారంలోనే ఉంటుంది అని ఇది వరకే మేము అప్డేట్ అందించాము. ఇప్పుడు ఈ టీజర్ పై మేము చెప్పినట్టే ఆ అప్డేట్ ఈ వారంలోనే వచ్చేసింది. ఇక ఈ చిత్రం నుంచి టీజర్ రేపు జూన్ 28న సరిగ్గా సినిమా రిలీజ్ కి నెల రోజులు ముందు టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

కాగా ఈ టీజర్ ని రేపు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం విశేషం. కాగా ఈ అప్డేట్ పై రిలీజ్ చేసిన పోస్టర్ మరింత హైలైట్ అని చెప్పాలి. మరి ఇందులో పవన్ తన వింటేజ్ చిత్రం “తమ్ముడు” లో వయ్యారి భామ సాంగ్ డ్రెస్సింగ్ నిక్కర్ ఎర్ర షర్ట్ లో కనిపిస్తుండగా.. 

సాయి ధరమ్ తేజ్ గబ్బర్ సింగ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. దీనితో ఈ పోస్టర్ మరింత క్రేజీ గా మారగా ఫ్యాన్స్ రేపు టీజర్ కోసం బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి అందిస్తుండగా ఈ చిత్రం ఈ జూలై 28న అయితే రిలీజ్ కాబోతుంది.