ఇప్పుడు టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్న చిత్రాల్లో దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం “బ్రో ది అవతార్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి నిన్ననే మేకర్స్ ఫస్ట్ లుక్ సహా సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేయగా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది.
కాగా దీనితో ఈ సినిమా పట్ల కూడా ఇపుడు మరింత హైప్ నెలకొనగా గత కొన్నాళ్ల కితం వచ్చిన నెగిటివ్ టాక్ అంతా కూడా కనిపించడం లేదు. అసలు రీమేక్ సినిమా అయినప్పటికీ ఇప్పుడు అభిమానులు కూడా దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కాగా ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఎందులో అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
మేకర్స్ అధికారికంగా చెప్పలేదు కానీ నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో అయితే సినిమా రిలీజ్ అయ్యిన 8 వారాల్లో అలా నెట్ ఫ్లిక్స్ లో అయితే ఈ చిత్రం వచ్చేస్తుంది అని చెప్పొచ్చు.
కాగా ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు మరియు జీ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ జూలై 28న అయితే గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కాబోతుండగా కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్స్ గా నటించారు.