బ్రో పొలిటికల్ టచ్.. సినిమాలో ఎంత ఉందంటే?

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత సినిమాలో సెలెక్ట్ చేసుకునే విధానం చాలావరకు చేంజ్ అయింది. అంతేకాకుండా సామాజిక అంశాలు ఎక్కువగా ఉన్న పాయింట్స్ ను టచ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో తన పొలిటికల్ అంశాలను కూడా టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అలాగని పూర్తిస్థాయిలో రాజకీయ ఉపయోగం కోసం మాత్రం సినిమాలో కథను కథనాలను మార్చడం లేదు.

వీలైనంతవరకు స్క్రీన్ ప్లే లో దర్శకులే పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రాండ్ ను కూడా టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నేడు విడుదలైన బ్రో సినిమాలో రాజకీయ వివాదాలు అయితే అసలు ఏమాత్రం టచ్ చేసింది లేదు. కేవలం ఒకే ఒక్క చోట మాత్రం పవన్ కళ్యాణ్ ఇసుక మాఫియా గురించి ఇన్ డైరెక్ట్ గా ఓ కామెంట్ చేసినట్లు అనిపించింది అని కామెంట్స్ అయితే వస్తున్నాయి.

ఈ భూమి మీదకు మనం కేవలం గెస్ట్లుగా మాత్రమే వచ్చాము అలాగని అది కాదని విర్రవీగుతూ దోచేస్తాం ఇష్టం ఉన్నట్లు తవ్వేస్తాం.. అంటే కుదరదు అని ఒక కౌంటర్ అయితే ఇచ్చారు. అలాగే సినిమాలో గాజు గ్లాసులు అయితే గట్టిగానే వైరల్ చేశారు. పవన్ కళ్యాణ్ రెండు మూడు సీన్స్ లో ఎక్కువగా గాజు గ్లాస్ పట్టుకున్నాడు.

అలాగే కిల్లి కిల్లి పాటలో కూడా గాజు గ్లాస్ ను బాగా హైలెట్ చేశారు. పొలిటికల్ గా డీప్ గా వెళ్లినట్లు కాకుండా చాలా తెలివిగానే జనసేన గుర్తును సినిమాలో దర్శకుడు సముద్రఖని హైలెట్ చేశాడు. సినిమాలో ఫ్యాన్స్ కు అయితే ఆ సీన్స్ బాగానే నచ్చుతాయి. మరి బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.