ఏంటి “బ్రో” ఈ ఫస్ట్ సాంగ్ ఇలా చేశారు…

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం “బ్రో” కూడా ఒకటి. కాగా ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా సాయి ధరమ్ తేజ్ అయితే మెయిన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రం నుంచి అయితే ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ ని అయితే ఇపుడు మేకర్స్ రిలీజ్ చేశారు.

కాగా ఈ ఫస్ట్ సాంగ్ ని థమన్ కంపోజ్ చేయగా ఈ సాంగ్ ఎలా ఉందో చూద్దాం. జెనరల్ గా ఇప్పుడు సినిమాలు నుంచి మొట్టమొదటి సాంగ్ అంటేనే ది బెస్ట్ ని ఎంపిక చేసి రిలీజ్ చేస్తారు, కానీ అలాంటిది మేకర్స్ చాలా వీక్ సాంగ్ ని అయితే రిలీజ్ చేసారని చెప్పాలి.

అసలు థమన్ సంగీతమే చాలా సోసో గా ఉండగా ఈ సాంగ్ ఆ లిరిక్స్ కూడా అలాగే అనిపిస్తున్నాయి. అయితే ఇందులో కాస్తో కూస్తో హైలైట్ ఏమన్నా ఉంది అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. తన డ్రెస్సింగ్ స్టైలిష్ వాక్ అంతా బాగున్నాయి. ఇంకా సాయి ధరమ్ తేజ్ ని కూడా బాగా రెడీ చేశారు.

ఇక ఈ సాంగ్ తోనే బాస్ బ్యూటీ ఊర్వశి ఇందులోనే కనిపిస్తుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. అయితే విజువల్ పరంగా బాగానే ఉన్న ఈ సాంగ్ వినడానికి అయితే అటు పవన్ కానీ థమన్ రేంజ్ లో అయితే ఇది లేదని చెప్పక తప్పదు. మరి నెక్స్ట్ సాంగ్స్ ఏమన్నా బాగుంటాయో లేదో చూడాలి. 
My Dear Markandeya Lyrical Video Song | BRO Telugu Movie | Pawan Kalyan | Urvashi Rautela | Sai Tej