పవన్ కళ్యాణ్ `వినోదయ సీతం` రీమేక్ కి బ్రేక్..? ఆలోచనలో పడ్డ సాయి ధరమ్ తేజ్..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన అభిమానులు ప్రాణాలు ఇవ్వటానికి సైతం సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హర హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన `వినోదయ సీతం` అనే తమిళ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉంది.

అయితే తాజాగా ఈ సినిమాకి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం కేటాయిస్తున్నారని, ఈ క్రమంలో హరహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా మధ్యలో ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతో ‘ వినోదయ సీతం ‘ సినిమా రీమేక్ కూడా ఆగిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించాల్సి ఉంది. తన మేనమామతో కలిసి ఈ సినిమాలో నటించటానికి సాయి ధరంతేజ్ వేరే సినిమాలను కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా మొత్తానికి ఆగిపోయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడానికి చాలాకాలం ఎదురుచూసి వేరే సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ కి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హర హర వీరమల్లు సినిమా 50% పూర్తి అయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తొందర్లోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొని సినిమాని తొందరగా ముగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.