బాబు మోహన్ సినిమాలలో ఉంటే నటించమని చెప్పిన కమెడియన్స్… ఎవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్లకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ క్రమంలోనే అన్ని భాషలలో కమెడియన్లు కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో కమెడియన్లకు ఏమాత్రం కొదువ లేదని చెప్పాలి. అయితే గత పది సంవత్సరాల వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ , కోట శ్రీనివాసరావు వంటి కమెడియన్స్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఎక్కువ సినిమాలలో బాబు మోహన్ కోట శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. అయితేబాబు మోహన్ నటి సౌందర్య తో కలిసి చినుకు చినుకు అందెలతో అనే పాట చేసినప్పటి నుంచి ఈయనకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక బాబు మోహన్ ఈ సినిమా తర్వాతే ఏ సినిమాలలో నటించిన ఆయనకు ప్రత్యేక పాట పెట్టేవారు. ఈ విధంగా దాదాపు 200 పాటలకు పైగా ఆడి పాడిన ఘనత బాబు మోహన్ కి ఉందని చెప్పాలి. ఇలా బాబు మోహన్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే బాబు మోహన్ కి వచ్చిన క్రేజ్ కారణంగా ఆయన సినిమాలలో ఇతర కమెడియన్ నటించినప్పటికీ వారికి గుర్తింపు రాలేదని భావించిన బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు వంటి కమెడియన్లు బాబు మోహన్ సినిమాలలో కనుక నటిస్తే ఆయన సినిమాలో మేము నటించమని తెగేసి చెప్పారట. అయితే ఈ విధంగా వీలు కలిసి సినిమాలలో నటించకపోవడంతో ఈ విషయంపై దాసరి నారాయణరావు, రాజేంద్రప్రసాద్ కలగజేసుకొని వీరితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బాబు మోహన్ వెల్లడించారు.