నాకు అవకాశాలు తగ్గి పోలేదు.. నేనే తగ్గించుకున్నా అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బ్రహ్మానందం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన కమెడియన్ గా ఎన్నో అవార్డులు అందుకొని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కామెడీ డైలాగులు నాటి తరం నుంచి నేటి తరం వారికి కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఇలా కొన్ని వందల చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ బ్రహ్మానందం ఈ మధ్య వెండి తెరపై కనిపించడం లేదు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే బ్రహ్మానందంకి అవకాశాలు తగ్గాయి.ఆయనకి సినిమాలు తగ్గించారు ఈ రెండు వాక్యాలలో ఏది సరైనది అనే ప్రశ్నకు ఆయన ఎదురవ్వగా అందుకు బ్రహ్మానందం స్పందిస్తూ తనకు సినిమా అవకాశాలు తగ్గలేదు నేనే అవకాశాలను తగ్గించుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇప్పటికీ తను తన కెరియర్ ని ఆపలేదని కేవలం తన శరీరానికి విశ్రాంతి ఇచ్చాననీ ఈ సందర్భంగా బ్రహ్మానందం వెల్లడించారు.

గత 35 సంవత్సరాల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి ఉదయం ఆరు గంటలకే వెళ్ళేవాడిని ఇలా నిరంతరం కష్టపడుతూ పనిచేయడం వల్ల తిన్నది అరగక వాంతులు చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా బ్రహ్మానందం వెల్లడించారు. ఇలా 35 సంవత్సరాలుగా నిరంతరం కష్టపడిన ఈ శరీరానికి ప్రస్తుతం విశ్రాంతి కావాలని కోరుకుంటున్నానని అందుకోసమే అవకాశాలు తగ్గించుకున్నాననీ తెలుపుతూ తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ వేస్తూ తన మనవడితో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతున్నానని ఈ సందర్భంగా బ్రహ్మానందం తెలియజేశారు.