Home Entertainment ఘాటైన రొమాన్స్‌తో హీట్ పెంచేస్తున్న న‌ట‌వార‌సుడు.. బ్ర‌హ్మాజీ స‌న్ `క్షీర సాగర మథనం`

ఘాటైన రొమాన్స్‌తో హీట్ పెంచేస్తున్న న‌ట‌వార‌సుడు.. బ్ర‌హ్మాజీ స‌న్ `క్షీర సాగర మథనం`

న‌ట‌వార‌సుల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న త‌రుణ‌మిది. స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో బ్ర‌హ్మాజీ స‌న్ `క్షీర సాగ‌ర మ‌థ‌నం` అంటూ బ‌రిలో దిగాడు. ఘాటైన రొమాన్స్‌తో హీట్ పెంచేస్తున్న ఈ న‌ట‌వార‌సుడు టాలీవుడ్ లో త‌న కంటూ ఓ ప్లేస్ ఖాయం చేసుకుంటాడా?

Brahmaji Son Sanjay E1598329504173 | Telugu Rajyam

అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ‘క్షీరసాగరమథనం’ టీజర్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ ట్విట్టర్ లో విడుదల చేయ‌గా చ‌క్క‌ని వ్యూస్ ని అందుకుంది. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు ప్రేక్షకులు.. “క్షీర సాగర మథనం” చిత్రాన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకముంది. ఈ చిత్రంలో బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ న‌ట‌న‌తో పాటు మాన‌స్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. సోనావ‌న్ గ్లామ‌ర్ అస్సెట్. మా చిత్రం టీజర్ సంచలన దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది” అన్నారు.

చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.

Whatsapp Image 2020 08 25 At 7.42.58 Am | Telugu Rajyam

Related Posts

ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ,...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య - సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న...

పాపం సాయి పల్లవి కవరింగ్ వర్కవుట్ అవ్వట్లేదాయె

హీరోయిన్ సాయి పల్లవి, 'భోళా శంకర్' సినిమాలో నటించాల్సి వుంది.. అదీ, మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో. కానీ, ఆ సినిమాకి ఆమె 'నో' చెప్పింది. మామూలుగా అయితే, ఇలాంటి విషయాల్లో హీరోలు...

Related Posts

Latest News