బాక్సాఫీస్ : 2 రోజుల్లో వరల్డ్ వైడ్ “ఆనిమల్” వసూళ్ల సెన్సేషన్..!

ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ లో సెన్సేషన్ గా వినిపిస్తున్న క్రేజీ సక్సెస్ చిత్రం “ఆనిమల్” కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ దిశగా వెళ్తుండగా ఈ సినిమాని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు.

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా మొదటి రోజే కాస్త నెగిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది. కానీ యూనానిమస్ గా మాత్రం మూవీ లవర్స్ ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రికార్డు వసూళ్లతో క్రేజీ నంబర్స్ ని అందిస్తున్నారు.

మరి మొదటి రోజే ఈ చిత్రానికి 110 కోట్లకి పైగా గ్రాస్ నమోదు కాగా రెండో రోజుకి కూడా ఊహించని విధంగా 100 కోట్లకి పైగా మాత్రమే కాకుండా మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్ళని ఆనిమల్ చిత్రం రాబట్టడం కేజ్రీగా మారింది. మరి ఈ చిత్రం రెండో రోజు మొదటి రోజు కన్నా 20 కోట్లు ఎక్కువ వసూలు చేసింది.

దీనితో రెండు రోజుల్లో ఆనిమల్ చిత్రం ఏకంగా 236 కోట్ల గ్రాస్ ని టచ్ చేసి సంచలనం నమోదు చేసింది. ఒక ఏ సర్టిఫికెట్ బాలీవుడ్ లో ఈ రేంజ్ లో పెర్ఫామెన్స్ చేయడం ఇదే ప్రప్రథమం అని చెప్పాలి. ఇక శనివారం వసూళ్లే ఇలా ఉంటే ఈరోజు ఆదివారం కూడా ఈ చిత్రం ఈజీగా ఇంకో 100 కోట్ల గ్రాస్ ని అందుకొని 300 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయిపోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.