‘ఆదిపురుష్‌’లో మరో బాలీవుడ్ స్టార్ హీరో !

Adipurush Prabhas Release Date Announced

ప్యాన్ ఇండియా స్టార్ , యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరక్కిస్తున్నారు. రామాయణగాథకు కాల్పానిక అంశాలను జోడించి తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సినిమాలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ సైతం భాగం కాబోతున్నట్లు సమాచారం. శివుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓంరౌత్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవ్‌గణ్‌ కథానాయకుడిగా నటించిన ‘తన్హాజీ’ చిత్రం గతేడాది బాలీవుడ్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. అజయ్‌ దేవ్‌గణ్‌ ఓం రౌత్‌తో చాలా సన్నిహిత సంబంధాలుండడంతో ఆ పాత్రను చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.

అయితే ఇప్పటి వరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆదిపురుష్ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తుండగా తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లోకి డబ్‌ చేసి, విడుదల చేయనున్నారు. చిత్రంలో సీత పాత్రకు బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రస్తుతం తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.