పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ఇదే కాగా మేకర్స్ అయితే ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కించారు.
అయితే ఈ చిత్రం ఎప్పుడు నుంచో తెరకెక్కించగా ఫైనల్ గా ఈ ఏడాదిలో అనేక కాంట్రవర్సీల నడుమ రిలీజ్ చేశారు. కానీ తీరా రిలీజ్ చేస్తే ఈ చిత్రానికి షాకింగ్ రిజల్ట్ దక్కింది. దారుణమైన డిజాస్టర్ టాక్ ఈ సినిమాకి రావడంతో జస్ట్ మూడు రోజుల్లోనే సినిమా రన్ కి ఎండ్ కార్డు పడింది.
అయితే సినిమాపై టాక్ అంతలా వచ్చినప్పటికీ రియల్ టైం లోకి వస్తే ఈ చిత్రం అంత దారుణమైన మరీ చూడలేనంత సినిమా అయితే కాదని చెప్పవచ్చు. అందుకు నిదర్శనంగా ఈ చిత్రంకు తెలుగులో ఫస్ట్ టైం వచ్చిన టీఆర్పీ రేటింగ్ కోసమే చెప్పాలి. ఇంత డిజాస్టర్ అయినప్పటికీ బుల్లితెరపై ఈ చిత్రం హిట్ అయ్యిందని చెప్పాం.
మరి ఈ సినిమా అయితే ఫైనల్ గా అఫీషియల్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి తెలుగులో 10.6 రేటింగ్ అయితే వచ్చినట్టుగా తెలిపారు. ఇది మాత్రం రీసెంట్ టైం లో చాలా బెటర్ రేటింగ్ అని చెప్పడంలో సందేహం లేదు. దీనితో ఫ్యాన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా ప్రభాస్ ర్యాంపేజ్ అనే అంటున్నారు. మొత్తానికి అయితే స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఆదిపురుష్ స్టాంప్ గట్టిగానే పడింది అని చెప్పవచ్చు.
Adipurush 🔥
Got a huge Blockbuster Rating at Television stream.
Prabhas Supremacy all over 🔥#Adipurush pic.twitter.com/KWqrS8m3yp— GSK Media (@GskMedia_PR) November 10, 2023