ఈ ఏడాది ఎండింగ్ బ్లాస్ట్ గా అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆనిమల్ కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హిందిలో చేసిన రెండో సినిమానే అక్కడ ఏ సర్టిఫికెట్ తో కనీ వినీ ఎరుగని రికార్డులు సెట్ చేసి ఇప్పుడు ఏకంగా 900 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తుంది.
మరి ఈ రేంజ్ సినిమాని ఇచ్చిన ఏ నిర్మాతలు అయినా ఎందుకు వదులుకుంటారు. మరి దీనిపై తనతో వర్క్ చేస్తున్న నిర్మాణ సంస్థ బాలీవుడ్ భారీ చిత్రాల సంస్థ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ అయినటువంటి టి సిరీస్ వారు తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. వారికి హిందీలో సందీప్ కబీర్ సింగ్ అనే బిగ్గెస్ట్ హిట్ ని ఇవ్వడంతోనే ఏకంగా ఐదు సినిమాలకి తాము సందీప్ ని లాక్ చేసుకున్నారు.
కాగా వారితో సందీప్ కూడా నిర్మాణంలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆనిమల్ లో కూడా తనకి భాగస్వామ్యం ఉంది. మరి దీనిపై నిర్మాణ సంస్థ టి సిరీస్ ఏమంటుంది అంటే తమ మధ్య ఉన్నది వ్యాపార సంబంధం అయితే కాదని తమ మధ్య ఇప్పుడు మంచి బంధం ఏర్పడింది అని.
అందుకే తమ కాంబినేషన్ లో నెక్స్ట్ ప్రభాస్ స్పిరిట్ చిత్రం కానీ ఆనిమల్ పార్క్ ఇంకా అల్లు అర్జున్ సినిమాలు రాబోతున్నాయని తెలిపారు. దీనితో సందీప్ రెడ్డి వంగ అలాగే నిర్మాత భూషణ్ కుమార్ లు కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేశారు. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై చాలా మందికి ఉన్న డౌట్స్ ని ఇప్పుడు వారు ఇలా క్లియర్ చేసేసారు.
It's a partnership built on trust, fueled by creative freedom, and fortified by an unbreakable bond. Producer Bhushan Kumar and Director #SandeepReddyVanga unveil the next cinematic wonders—Prabhas' Spirit, Animal Park, and an Allu Arjun saga—the chapters that follow the… pic.twitter.com/kSAVQhICCW
— T-Series (@TSeries) December 19, 2023