బిజీ.. బిజీగా సంయుక్త .. వరుసగా పలు చిత్రాల్లో ఆఫర్లు!

తెలుగులో వరసగా విజయాలు ఈమధ్యకాలంలో సాధించిన నటి ఎవరైనా వున్నారు అంటే ఆమె ఒక్క సంయుక్త అని చెప్పొచ్చు. మలయాళ భామ అయిన ఈమె తెలుగులో ‘భీమ్లా నాయక్‌’ తో ఆరంగేట్రం చేసిన దగ్గర నుండి వరసగా విజయాలు సాధించింది సంయుక్త. తరువాత ‘బింబిసార’ ఇంకో పెద్ద విజయం, ఆ తరువాత ఏకంగా తమిళ స్టార్‌ ధనుష్‌ పక్కన ‘సర్‌’ సినిమాలో చేసింది.

ఇది తెలుగు, తమిళంలో విజయం సాధించింది. దీని తరువాత ‘విరూపాక్ష’ సినిమాలో చేసి ఆ సినిమాతో ఇంకో పెద్ద విజయం నమోదు చేసుకుంది సంయుక్త. ఇప్పుడు ఇంకో పెద్ద తెలుగు ప్రాజెక్ట్‌ ‘స్వయంభు’ చేస్తోంది, ఇందులో నిఖిల్‌ సిద్దార్థ కథానాయకుడు.

ఈ సినిమా కోసమని సంయుక్త గుర్రం స్వారీ కూడా నేర్చుకుంది. ‘స్వయంభు’ అన్ని భాషల్లో విడుదల చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇదిలా ఉంటే ఇంకో తెలుగు సినిమా శర్వానంద్‌ పక్కన కూడా ఇంకో ప్రాజెక్ట్‌ చేస్తోంది. ఇలా మంచి ప్రాజెక్టులతో వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న సంయుక్తకి ఇప్పుడు ఇంకో పెద్ద ఆఫర్‌ వచ్చిందని సమాచారం. అది దక్షిణాదిలో కాదు, ఏకంగా బాలీవుడ్‌ నుండి వచ్చిందని సమాచారం.

హిందీలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ కోసం సంయుక్త ని ఎంపిక చేసారని ఒక టాక్‌ నడుస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా బాగుంటుంది అని, అందుకనే ఆమెని ముంబై పిలిపించారని, ఆమె ఈ హిందీ సినిమా ఖరారు చేసుకునేందుకు ముంబై వెళ్లిందని తెలుస్తోంది.

విమానాశ్రయంలో సంయుక్త వెళుతున్న ఫోటోస్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం ఆ హిందీ సినిమా ఖరారు చేసుకునేందుకు ముంబై వెళుతోందని, త్వరలోనే ఆ సినిమా వివరాలు సంయుక్త ప్రకటించ వచ్చని తెలుస్తోంది. ఈ హిందీ సినిమా ఖరారైతే ఇటు దక్షిణాదిలో కొనసాగిస్తున్న విజయపరంపరని ఇప్పుడు అటు హిందీలో కూడా సంయుక్త కొనసాగిస్తుందని చెపుతున్నారు.