Alia – Ranbir Marriage: బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడో జరగాల్సిన వారి పెళ్లి, కరోనా కారణంగా ఇన్ని రోజులూ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వీరి పెళ్లి ఇంకెప్పుడు జరుగుతుంది అన్న ప్రశ్న రోజురోజూకీ చాలా మందిని వెంటాడుతోంది. చాలా కాలం నుంచీ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరి పెళ్లి ఇరువురి పెద్దలూ గ్రీన్ సిగ్నల్ కూడా ఎప్పుడో ఇచ్చేశారు. ఇక వీరి వివాహం అసలు ఇప్పట్లో జరిగేలా లేదని కొందరు ఫ్యాన్స్ కూడా చమత్కరిస్తున్నారు. పెళ్లికి గల ఆలస్యం ఎందుకో ఎవరికీ సరిగా తెలియనప్పటికీ, తమ అభిమాన హీరో, హీరోయిన్ వివాహాన్ని ఎపుడెపుడు చూడాలా అని వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో రణ్‌భీర్- అలియాల పెళ్లి అప్పుడే జరిగిపోయిందంటూ కొంతమంది ఫేక్ ఫోటోస్‌ను క్రియేట్ చేసి, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక మరికొందరేమో అప్పుడు, ఇప్పుడు అంటూ కొన్ని ప్రచారాలు చేస్తూ ట్రెండింగ్‌గా నిలుస్తున్నారు. అయితే వీరి పెళ్లి ఏప్రిల్‌లోనే ఫిక్స్ అని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. ఇక వారి పెళ్లి ఓ సెంటిమెంట్ ప్లేస్‌లో జరుగుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
అంతే కాదు అలియా-రణ్‌బీర్‌లు డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా తమ ఫ్యామిలీ సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లి వేడుకను జరపుకొనున్నారట . ఇక కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్- ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు రణ్‌బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్‌ల పెళ్లి కూడా అక్కడే జరిగిందని టాక్. కాబట్టి వీరి పెళ్లి కూడా అక్కడే జరగనున్నట్టు సినీ వర్గాల సమాచారం. కాగా రణ్‌బీర్-అలియా కలిసి తొలిసారి జంటగా నటించిన బ్రహ్మస్త్ర తొలి పార్ట్ షూటింగ్ రీసెంట్‌గా పూర్తయ్యింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ పెళ్లి నేపథ్యంలోనే వీరు కాస్త విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది.