వైరల్ : “పఠాన్” వసూళ్లపై బాలీవుడ్ హీరోయిన్ పంచ్!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర భారీ గ్రాసర్ చిత్రాల్లో అయితే ఒకటిగా నిలిచిన చిత్రం “పఠాన్”. ఒక్క ఈ ఏడాది లోనే కాకుండా మొత్తం బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం ఒక బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి హీరో షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ వసూళ్ల సినిమాగా నిలవగా ఈ సినిమా వసూళ్ల విషయంలో అయితే గత కొన్నాళ్ల నుంచి కూడా కొందరిలో అయితే అనుమానాలు ఉన్నాయి.

కానీ అవేవి అంతగా అయితే ఎక్స్ పోజ్ కాలేదు. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ వర్గాల్లో మరోసారి పఠాన్ వసూళ్ల ప్రస్తావన వచ్చింది. అయితే ఇది జెనరల్ గా ఫాన్స్ లో కూడా కాదు ఇప్పటికే షారుఖ్ తో ఎన్నో చిత్రాలు నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవగణ్ మాట్లాడ్డం వైరల్ గా మారింది.

అయితే రీసెంట్ గా ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఇప్పుడు షారుఖ్ ని కలిస్తే ఏమన్నా అడగాలి అనుకుంటున్నారా అనే ప్రశ్నకి అయితే ఆమె అందుకు బదులుగా “పఠాన్” నిజమైన వసూళ్లు ఎంత అని షారుఖ్ ని అడుగుతాను అని చెప్పింది. దీనితో మరోసారి పఠాన్ వసూళ్లు ప్రస్తావన వచ్చింది.

అలాగే బాలీవుడ్ వాళ్ళు ఫేక్ నంబర్స్ వేసుకుంటున్నారు అనేది నిజం అనడానికి కాజోల్ ప్రశ్న కూడా సమాధానం కావచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే కాజోల్ వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సహా బాలీవుడ్ మీడియా వర్గాల్లో కూడా వైరల్ గా మారింది. ఇక కాజోల్ అయితే రీసెంట్ గా చేసిన అడల్ట్ ఆంథాలజీ లస్ట్ స్టోరీస్ 2 తో పలకరించగా షారుఖ్ జవాన్ సినిమాతో రాబోతున్నాడు.