ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్, నటి సోనీ రజ్దాన్ కుమారై అయిన అలియా భట్ ఐదేళ్ల వయస్సులో సంఘర్ష్ చిత్రంలో నటించారు.ఆ తరువాత 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. ఈ మూవీ హిట్ అవ్వడంతో పాటు అలియాకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో కెరీర్ ప్రారంభమైన కొన్ని సంవత్సరాల్లోనే ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కొందరి హీరోయిన్ లా కేవలం కమర్షియల్ సినిమాలకు పరిమితం అవ్వకుండా ప్రయోగాత్మక చిత్రాల్లోనూ ఆలియా నటించింది.
ఈ క్రమంలో హైవే, రాజీ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆలియా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా నటిస్తోంది. ఇందులో సీత పాత్రలో రామ్ చరణ్ సరసన ఆమె కనిపించనుంది. సినిమా సినిమాలకు మంచి గుర్తింపును తెచ్చుకుంటూ తండ్రికి తగ్గ కూతురుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలా అలియా భట్ తన తండ్రి సంపాదనను మించి పోయిందట. ఇదే విషయాన్ని ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ మురిసిపోతూ వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ అనే కాదు ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ ఫుల్ కావాలి అంటే ఏ ప్రతిభా ఉండాల్సిందే. వారసత్వం అనేది కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ప్రతిభా కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు.
ఇలా కొంత మంది తమ టాలెంట్ తో చిన్నవయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు. వారిలో నా గారాల కూతురు అలియా భట్ ఉండటం నాకు గర్వంగా ఉంది. నేను యాభై ఏళ్లలో కష్టపడి సంపాదించిన డబ్బును ఆలియా కేవలం రెండేళ్లలోనే సంపాదించింది అని మహేష్ భట్ ఆనందం వ్యక్తం చేశారు.