Tollywood: షాలిని పాసి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె అత్యధిక నటిగా అలాగే ఇండియాలో ధనిక పారిశ్రామికవేత్త భార్యగా చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షాలిని పాసి పేరు, ఫోటోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్ హిట్ రియాలిటీ షో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ద్వారా షాలిని పాసి మరింత పాపులర్ అయ్యింది.
ఈ షో ద్వారానే షాలిని ఒక రేంజ్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో షాలిని పాసి గురించి గూగుల్ సెర్చ్ ఎక్కువగా చేస్తున్నారు నెటిజన్స్. మరోవైపు ఈ అమ్మడు గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఆ న్యూస్ విన్న అభిమానులు నెటిజన్స్ నోరెళ్ళ బెడుతున్నారు. కేవలం ఈమె సంపాదన విషయంలో మాత్రమే కాకుండా అందం విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు. తన అందాన్ని కాపాడు కోసం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది షాలిని. అందులో భాగంగానే ఆమె పాల తో స్నానం చేసేదని సోషల్ మీడియాలో ఒక ప్రచారం గట్టిగా నడుస్తోంది. అయితే తాజాగా ఇదే విషయాన్ని నేరుగా షాలిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. దీనిపై షాలిని మాట్లాడుతూ..
నేను పాలతో స్నానం చేస్తాననడం నిజం కాదు. షోలో నన్ను అడిగిన ప్రతి దానికీ నేను అవును అని చెబుతాను కాబట్టి నేను వివరించనవసరం లేదు. ఇతర తారాగణం సభ్యులకు నేను ఏమీ వివరించాల్సిన అవసరం లేదు. లేదా వివరించడానికి ఏమీ లేదు అని చెప్పుకొచ్చింది. అయితే రూమర్స్ కి తాను అవును అని చెప్పినప్పటికీ, షోలో తన అలవాట్ల గురించి ఎవరూ వివరంగా చెప్పనవసరం లేదని షాలిని తన సమాధానంలో స్పష్టం చేసింది. షాలిని మాట్లాడుతూ.. నేను నివసించే ప్రాంతంలో, మాకు ఆవులు, గుర్రాలు, మేకలను ఉంచడానికి అనుమతి లేదు. ఇది నియమం. నేను పాలతో స్నానం చేయను. ఇది కేవలం ప్రచారం మాత్రమే అని చెప్పుకొచ్చింది.