Prabhas : ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ విడుదలయి మిశ్రమ స్పందనతో వెలుతోంది. చాలా మంది సినిమా చాలా నెమ్మదిగా ఉందని అంటుంటే దానికి కౌంటర్ గా ప్రేమ కథ అలాగే ఉంటుంది అంటున్నారు మరికొంతమంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి.ఇటాలియన్ కల్చర్ లో ఒక ఇండియన్ సినిమాని తీయడం ఇదే మొదటిసారి, దీన్ని చూడటం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. ఒక ప్రేమకథను మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు . ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెట్స్ దే ప్రధాన పాత్ర. ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్స్ ను వేశారట. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పనితనం ఈ సినిమాకు చాలా ఉపయోగపడిందని ప్రశంసలు కూడా అందుకున్నారు.ఈ సినిమా కోసం నాలుగు ట్రైన్ సెట్స్ వేశారు రవీందర్. ఓ భారీ షిప్ సెటప్ కూడా ఉంది.ఇటలీ కట్టడాల్ని పోలిన నిర్మాణాలు హైదరాబాద్‌లో సెట్స్ రూపంలో తీర్చిదిద్దారు.
అయితే ఇదంతా వదిలేసి బాలీవుడ్ జనం ప్రభాస్ వయసు మీద పడ్డారు.సినిమాకు రివ్యూ ఇయ్యమంటే చాలా వ్యక్తిగతంగా హీరో గురించి వాఖ్యలు చేసారు. సినిమా క్రిటిక్, రచయిత్రి అనుపమ చోప్రా రాధే శ్యామ్ గురించి రివ్యూ ఇస్తూ హద్దులు దాటి ప్రభాస్ వయసును ఎత్తిచూపారు. ప్రభాస్ వయసు 42 అని భాగ్యశ్రీ వయసు 52 అని తనను తల్లిగా పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు . అంతే కాకా ప్రభాస్ కు భాగ్యశ్రీ చెల్లిలా ఉందని మరికొందరు క్రిటిక్స్ వ్యంగ్యాన్ని జోడించారు . ఇక ఈ వాఖ్యలను చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాడేసి నెగెటివ్ రివ్యూలతో దంచేస్తున్నారు.
ఎంత ఖర్చుతో తీస్తే ఏం లాభం ? సినిమాలో ఎమోషనల్ కనెక్షన్ లేదని, అసలు ఆ మాత్రం కథ చెప్పడానికి ప్రభాస్ లాంటి స్టార్, అంత సెటప్ ఎందుకని విశ్లేషణలు ఇచ్చారు. ఇక బాలీవుడ్ జనాలకు కూడా సినిమా పెద్దగా నచ్చలేదు. ప్రతి సినిమాని బిజినెస్ లా చూసి ఆచితూచి స్పందించే తరుణ్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ ఎనలిస్టులు కూడా సినిమా అస్సలు బాలేదని తీర్మానం చేసేశారు.
సినిమా ఎలా ఉందొ రివ్యూ ఇచ్చే హక్కు అందరికి ఉంటుంది కానీ వ్యక్తిగతంగా వయసు గురించి మాట్లాడటం సమంజసంగా లేదు ఈ బాలీవుడ్ జనాలు ఎప్పటికి మారుతారో. పాతతరం నటిమణులను తల్లి పాత్రలకు తీసుకోవడం ప్రతి సినీ పరిశ్రమలోనూ కామనే. భాగ్యశ్రీ అంటే అభిమానం ఉత్తరాది వారికి ఉండొచ్చు అంత మాత్రాన ప్రభాస్ కు చెల్లిగా ఉందంటూ మాట్లాడటం ఎం బాగోలేదు.అభిమానాన్ని ఇంకొకరిని కించపరిచి మరీ చూపించాల్సిన పని లేదు.