బాలీ బజ్ : కియారా పెళ్లి..ఎప్పుడు ఎక్కడంటే.!

బాలీవుడ్ సినిమా దగ్గర అలాగే టాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ లలో స్టార్ వెరీ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ కూడా ఒకామె కాగా ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా పెళ్ళికి రెడీ అయిపోయింది. మరి గత కొన్నాళ్ల కితమే కియారా పెళ్లి బాజాలపై బాలీవుడ్ లో పలు వార్తలు రాగా ఇప్పుడు ఆమె పెళ్లిపై కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి.

మరి కియారా అద్వానీ అయితే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ని వివాహం చేసుకోనుండగా వీరి పెళ్లి అయితే అత్యంత ఘనంగా సూర్య గార్హ్ ప్యాలెస్ హోటల్లో గ్రాండ్ గా జరగబోతుందట. అంతే కాకుండా ఈ పెళ్లి వేడుకలు మొత్తం మూడు రోజులు పాటు ఉండనున్నాయని తెలుస్తుంది.

ఈ ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనుండగా ఈ శుభకార్యానికి గాను అనేక మంది తారల కోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లు కూడా వేసారట. దీనితో వారి అందరి సమక్షంలో వీరి పెళ్లి జరగనుందట. ఈ రకంగా అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కింది.

మరి ఇప్పుడు పలు భారీ బాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగులో అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తుంది. ఈ పెళ్లి హంగామా తర్వాత మళ్ళీ తాను షూటింగ్ లో పాల్గొననుంది.