టాలీవుడ్‌కి వస్తోన్న బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలాంటి తేడాలేమీ లేవిప్పుడు నిజానికి. షారుఖ్ ఖాన్ ఇటీవల ‘జవాన్’ సినిమా చేశాడు. అది హిందీ సినిమానా.? తమిళ సినిమానా.? అన్న విషయమై బోల్డన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అది ఇండియన్ సినిమా.. అని తేల్చేశారు చివరికి.

సౌత్ సినిమాల్లో నటించడానికి ఒకప్పుడు బాలీవుడ్ ప్రముఖులు మొహం చాటేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అవకాశాలు వెతుక్కుని మరీ బాలీవుడ్ ప్రముఖులు సౌత్ సినిమాకి వస్తున్నారు.

అసలు విషయానికొస్తే, కొన్నాళ్ళ క్రితం తెలుగు సినిమాలో నటించడానికి తెగ మొహమాటపడ్డ బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్, తాజాగా ఓ తెలుగు సినిమాకి సైన్ చేసిందట. పైగా అదేమీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదట.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకపోయినా, కరీనా రాకతో.. దాని రేంజ్ పెరగబోతోందని అంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది.

అన్నట్టు, ఈ సినిమాలో కరీనా కపూర్ పాత్ర నిడివి కూడా పెద్ద ఎక్కువేమీ కాదట. జస్ట్ ఓ 20 నుంచి 30 నిమిషాల మేర మాత్రమే వుంటుందట. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.